logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కొమ్మర్తి గ్రామంలో ప్లేకార్డ్ ధర్నాతో ముగిసిన జీడి రైతుల ఆందోళన

ఆందోళనఅనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొమ్మర్తి, మచ్చిపురం, బుడ్డిబండ, కవ్వుకుంట గ్రామాల్లో గిరిజనులు, దళితులు, ఇతర పేదలు 350 మంది ఊరలోవ రెవెన్యూ పరిధిలో డీ-పట్టాలు కలిగి ఉన్నారు. ఈ రెవెన్యూ వెబ్‌ల్యాండ్ మాడుగుల మండలం పరిధిలో ఉండటం, 2012-13లో పట్టాలు ఇచ్చినప్పటికీ రెవెన్యూ వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఊరలోవ రెవెన్యూ నమోదు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. భూసమస్యల కమిషనర్ (సీసీఎల్) విజయవాడకు సీపీఎం ప్రతినిధి బృందం విన్నపం చేసి, కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నెల రోజుల్లో రికార్డులు తయారుచేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.ఎంఆర్ఓ, అధికారులు 2025 సెప్టెంబర్‌లో వి.జె.జగన్నాధపురం శాసనసభ్యులు చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు బి.సత్యనారాయణమూర్తి, కెఎస్‌ఎన్ రాజు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో జనవరి నెలలో ఊరలోవ రెవెన్యూ వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో నమోదు చేసి పట్టాలిస్తామని ప్రకటించారు కానీ నేటికీ పట్టాలు ఇవ్వలేదు. 350 ఎకరాల్లో 350 మంది ఆధారపడి జీడి పంటలు పండించుకుంటున్నారు. జీడి తోటలకు క్రాప్ నంబర్ చేయాలి, రైతు భరోసా పథకం వర్తింపు చేయాలని కోరుతున్నారు.రైతు భరోసా కేంద్రం ద్వారా జీడి పెక్కల కొనుగోలు, కేజీకి రూ.200 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో ప్లేకార్డులు ప్రదర్శించి ఆందోళన నిర్వహించారు. ఈ ధర్నాకు గిరిజన రైతు సంఘం నాయకులు సోలం రాజు, జీడి రైతులకు అప్పలనాయుడు, మల్లు దేవుళ్ళు అద్దె సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

10
1031 views

Comment