ఉత్సాహంగా ప్రారంభమైన జనసేన సభ్యత్వ కార్యక్రమం
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో జనసేన సభ్యత్వ కార్యక్రమం అద్భుత ఉత్సాహంతో ప్రారంభమైంది. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జనసైనికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం చోడవరం నియోజకవర్గం కొవ్వూరులో గొప్ప ఫలితాలు ఇస్తోంది.కొవ్వూరు జనసేన అధ్యక్షుడు నందారపు చందర్రావు మాట్లాడుతూ, "ఈ సభ్యత్వం ప్రతి కార్యకర్తకు భరోసాని, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబాలకు ఇది ఆసరాగా నిలుస్తుంది" అని తెలిపారు.ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన అనేక సామాజిక కార్యక్రమాలు, చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పివీఎస్ ఎన్ఎస్ రాజు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకోవటం వల్ల ప్రజలు జనసేనకు నీరాజనం పడుతున్నారని, స్వచ్ఛందంగా సభ్యత్వాలకు ముందుకు వస్తున్నారని చందర్రావు పేర్కొన్నారు. సభ్యత్వం కేవలం 400 రూపాయలు మాత్రమేనని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ జనసైనికులు, ముఖ్యంగా వీరవనితలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సభ్యత్వాలు పొందారు.