రోలుగుంట మండలం ఎంఆర్సి సిబ్బంది మార్చి 6 'చలో విజయవాడ'కు మాస్ లీవ్ అభ్యర్థన
అనకాపల్లి జిల్లా రోలుగుంట, : సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 2026 మార్చి 6న విజయవాడలో నిర్వహించనున్న 'చలో విజయవాడ' రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమానికి మాస్ లీవ్ మంజూరు చేయాలని రోలుగుంట మండలం ఎంఆర్సి సిబ్బంది ఎంఇఓ కి విన్నత పత్రం సమర్పించారు. వేతనాల పెంపు, సేవా నిబంధనలు, క్రమబద్ధీకరణ, కనీస టైమ్ స్కేల్ అమలు, హెచ్‌ఆర్ పాలసీ రూపకల్పన, ఉద్యోగ భద్రత, సంక్షేమ సౌకర్యాలు వంటి ప్రధాన సమస్యల పరిష్కారం కోరుతూ ఈ అభ్యర్థన చేశారు.గతంలో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను కలిగించింది. 2025 నవంబర్ 4 మరియు డిసెంబర్ 19 తేదీలలో రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో వేతనాలతో పాటు సేవా నిబంధనలు, హెచ్‌ఆర్ పాలసీ, ఉద్యోగ భద్రత వంటి నాన్-ఫైనాన్స్ సమస్యలకు కూడా పరిషకారాలు రాలేదు. ఈ నిరాశలోనే ఉద్యోగుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణార్థం మార్చి 6న విజయవాడలో శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.రోలుగుంట మండలం ఎంఆర్సి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాస్ లీవ్ మంజూరు చేయాలని ఎంఇఓ ని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు ఎప్పటికీ పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిబ్బంది, ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయకపోతుంటే ఉద్యోగులు మరింత ఆందోళనకు దిగవలసి వస్తుందని చెప్పారు.