ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చెయ్యాలి
*తెలంగాణ ఉద్యమకారుల సంఘం జేఏసీ డిమాండ్ ,
తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం *(ఫిబ్రవరి 25 ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చెయ్యాలి
- హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ అమలు చేయాలి ,
- తెలంగాణ ఉద్యమకారుల సంఘం జేఏసీ డిమాండ్ ,
- చండ్రుగొండలో ఉద్యమకారుల సంఘం ప్రత్యేక సమావేశం ,
- స్థానిక తహశీల్దార్ కు మెమొరాండం అందజేసిన ఉద్యమకారులు,
ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం (జేఏసి) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం చండ్రుగొండ మండల కేంద్రంలో ఉమ్మడి చండ్రుగొండ, అన్నపరెడ్డిపల్లి, మండలాల ఉద్యమకారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తూ హర్షం వ్యక్తంచేశారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల సంఘం జేఏసీ మండల అధ్యక్షులు గాదె లింగయ్య ప్రధాన కార్యదర్శి షేక్ జాఫర్, సంఘం గౌరవ అధ్యక్షులు షేక్ ఉమర్ మాట్లాడుతూ... ఎన్నో త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో, ఆదాయ వనరులలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అయినా కూడా నేటికీ తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. ఉద్యమ సమయంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని. అలాగే పోలీసు వారి కేసులను కూడా లెక్కచేయకుండా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నమన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు అవి చేస్తాం, ఇవి చేస్తామని, ప్రకటనలు చేస్తూన్నారు. అనంతరం ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఉద్యమకారులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఉద్యమకారులు హైకోర్టును ఆశ్రయించి తమ గోడును తెలియజేయడం జరిగిందన్నారు. ఉద్యమకారుల సమస్యలను సానుకూలంగా విన్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు స్వరాష్ట్రకారుల పింఛన్లు, ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు, హెల్త్ కార్డులు, ఉద్యమకారుల కుటుంబాల్లో అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, చేతివృత్తుల వారికి సబ్సిడీ రుణాలు అందించి ఉద్యమకారులకు చేయూతనందించాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ బి సంధ్యారాణికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి సైదయ్య, వేముల హరీష్, గుగులోతు రమేష్, ఆకుల శ్రీనివాస్, మాలోతు లక్ష్మణరావు, లకావత్ కృష్ణ, సుంకర రామారావు, అంచ కృష్ణ, మహమ్మద్ నాబీద్, సులగం శ్రీనివాస్, దుంప అర్జున్, షేక్ ముస్తఫా, షేక్ అన్వర్, బానోత్ బద్రు, లకావత్ చిన్న, తేజావత్ బీముడు, ఇస్లావత్ ఖతిరాం, మహమ్మద్ జాకీర్ హుస్సేన్, అంచ యాకయ్య, లకావత్ రమేష్, తేజావత్ వీరన్న, పాలెపు వెంకటేశ్వర్లు, షేక్ జిలాని, నాగేష్ రెడ్డి, ఉమ్మడి చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, మండలాల ఉద్యమకారులు పాల్గొన్నారు.