జ్ఞాపకార్థంగా హిమశివలింగం, అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠ ఏర్పాటు, వేలమంది భక్తులు వీక్షించారు
జ్ఞాపకార్థంగా హిమ శివలింగం, అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠ
సూర్య ప్రతినిధి
రాజాం:
రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి యాత్ర సందర్భంగా దాకారపు రమణ–పార్వతి దంపతుల జ్ఞాపకార్థం వారి అల్లుడు, కుమార్తె ఆధ్వర్యంలో హిమ శివలింగం, అమ్మవారి విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. భక్తి పరవశంలో జరిగిన ఈ కార్యక్రమం యాత్రకు ప్రత్యేక శోభను తీసుకొచ్చింది.
దివంగతుల స్మృతిని నిలుపుకుంటూ నిర్వహించిన ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం కుటుంబ సభ్యుల సేవాభావాన్ని ప్రతిబింబించింది. యాత్రకు విచ్చేసిన భక్తులు విగ్రహాలను దర్శించుకుని కుటుంబ సభ్యులకు శుభాభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాకారపు రమణ–పార్వతి కుమారులు శివ, రాజా, రూప, పావని, వారి అమ్మ కుమారి, రవ్వ మోహన్‌రావు కుమారుడు, కోడలు సందీప్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. విగ్రహాల ప్రతిష్ఠాపన యాత్రకు వచ్చిన భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.