అర్ధరాత్రి నడిరోడ్డుపై కన్న తండ్రిని కాళ్లతో తన్ని నడిరోడ్డుపై వదిలేసిన కిరాతకుడు
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** ఫిబ్రవరి 26**( ఏఐఎంఏ మీడియా)
*********************
అర్ధరాత్రి నడిరోడ్డుపై కన్న తండ్రిని కాళ్లతో తన్ని నడిరోడ్డుపై వదిలేసిన కిరాతక కొడుకు
కన్న తండ్రిని కారులో నుంచి దించి, రోడ్డుమీద వదిలేసి వెళ్లిపోయిన కొడుకు.
తండ్రి అంటే జీవితం మొత్తం కష్టపడి పిల్లల కోసం బ్రతికే మనిషి.
చేతి పట్టి నడిపించిన వాడిని… చివరికి నడిరోడ్డుపై ఒంటరిగా వదిలేయడం ఎంత బాధాకరం!
ఆ రాత్రి రోడ్డుపై వెళ్తున్న కార్ డాష్‌క్యామ్‌లో ఆ దృశ్యం రికార్డ్ అయిందట. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజం ఏదైనా కావచ్చు… కానీ ఒక తండ్రి గుండె పగిలిపోయి ఉంటుంది.
పిల్లలను పెంచడం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు… ప్రేమ, విలువలు, గౌరవం నేర్పించడం కూడా.
అలాగే పిల్లలుగా మన బాధ్యత కూడా గుర్తు పెట్టుకోవాలి —
తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చిన్నపిల్లలే అవుతారు.కోపంలో తీసుకున్న ఒక నిర్ణయం…జీవితాంతం మానని గాయం అవుతుంది.మన సమాజంలో బంధాలు ఇలా రోడ్డుమీద పడిపోకూడదు.
తండ్రిని గౌరవించడం మన సంస్కృతి.
ఆ తండ్రికి ధైర్యం కలగాలి
నిజం బయటపడాలి. ఇలాంటి సంఘటనలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయో ఆలోచించండి సామాజిక బాధ్యత పై స్పందించండి ఇది ఏ ఒక్కరిదో సమస్య కాదు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం కాకూడదు. ఇలాంటి సంఘటనలకు పాల్పడే వారికి
నాన్బెయిలబుల్ సెక్షన్లతో కఠినంగా శిక్షించాలని కోరుతున్న ప్రజానీకం