logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వరలక్ష్మి డైరీ' యజమాని అడ్డాల గణేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు.

*రాజమండ్రిలో కల్తీ పాల ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనలో బాధితుల పట్ల వైద్యపరమైన నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై ప్రభుత్వం సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు, కల్తీకి కారణమైన వారిపై కఠిన చర్యలు చేపట్టింది*
ఈ కల్తీ పాలను సరఫరా చేసిన కోరుకొండ మండలం నరసాపురంలోని 'వరలక్ష్మి డైరీ' యజమాని అడ్డాల గణేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు.
రిమాండ్: నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు.
​కారణం: డైరీలో పాలు నిల్వ చేసే ఫ్రీజర్ నుంచి ఇథిలీన్ గ్లైకాల్ (Ethylene Glycol) అనే కెమికల్ లీకై పాలలో కలవడం వల్లే ఈ విషాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పాలు చేదుగా ఉన్నాయని వినియోగదారులు ఫిర్యాదు చేసినా, లాభాపేక్షతో నిందితుడు అవే పాలను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం సుమారు 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరికి కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ నిర్వహిస్తున్నారు.

0
400 views

Comment