రెండేళ్లుగా అధికారంలో ఉండి ఏ ఒక్క పని చేపట్టలేకపోయాడు *వైయస్సార్సీపి జిల్లా పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగిన జిల్లా అధికార
*ఆయన కష్టపడి జిల్లాను సాధిస్తే ఈయన ఏ కష్టం లేకుండా ప్రజలను మభ్యపెట్టి జిల్లాను నిలబెట్టాలేకపోయాడు.*
*రెండేళ్లుగా అధికారంలో ఉండి ఏ ఒక్క పని చేపట్టలేకపోయాడు.*
*ప్రభుత్వం నిధులు ఇచ్చిన ఇవ్వకపోయినా సొంత నిధులతో అయినా 50 పడుకుల ఏసీ మెటర్నెట్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని చెప్పి రెండేళ్లయింది, అది మాటలకే పరిమితమైంది.*
*అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తపల్లిలో బాలికల ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు అయిందని హడావిడి చేశారు ,అది జీవో కాగితాలకే పరిమితమైంది*
*రాయచోటికి టిడిపి చేసిందేమి లేదు, ఇకమీదట చేయబోదు.*
*రాయచోటి అభివృద్ధి అంతా గడికోట శ్రీకాంత్ రెడ్డి హయాంలోనే జరిగింది.*
*గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటిను వందేళ్లు ముందుకు తీసుకెళ్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వందేళ్లు వెనక్కి నెట్టింది*
*జిల్లా కేంద్రం కావాలంటే మరో వందేళ్లు ఆగాల్సిందే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే*
*గత ప్రభుత్వంలో మంజూరైన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ముందుకు కదల్లేదు.*
*పనులు పూర్తి చేసుకున్న అభివృద్ధి పనులను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించుకోలేని స్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం.*
*జిల్లా కేంద్రం తొలగించి జిల్లా కేంద్రానికి సమానంగా అభివృద్ధి చేస్తామని కల్లిబోల్లి మాటలు చెప్పిన ప్రభుత్వం.*
*వైయస్సార్సీపి జిల్లా పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగిన జిల్లా అధికార ప్రతినిధి గాజుల హాజీ భాష.*.
మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసి రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశాడని, ప్రస్తుత పాలకులు ఎలాంటి కష్టం పడకుండానే జిల్లాను రెండు ముక్కలు చేస్తామని ప్రకటించిన వెంటనే థాంక్యూ సీఎం అంటూ పెద్ద ర్యాలీ చేసి తొడలు కొట్టి ప్రజలను మభ్యపెట్టి వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గాజుల హాజీ భాష ధ్వజమెత్తారు.
జిల్లా అధికార ప్రతినిధి గా నియామకం ఆయన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ద్వారా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ అధికార ప్రతినిధి హోదాలో మొట్టమొదటి మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాయచోటికి చేసిందేమీ లేదని, ఇకమీదట ఏది చేయబోదని జోస్యం చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరుగని విధంగా నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీ మూటగట్టుకుందన్నారు.. రాయచోటి జిల్లా కేంద్రం కావడానికి వందేళ్ల సమయం పడుతుందని, కూటమి ప్రభుత్వం రాయచోటి అభివృద్ధిని వందేళ్లకు వెనుకబాటుకు గురి చేసిందని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఎవరి సమక్షంలో వారు చేరుతున్నారో ఆ నాయకుడు సైతం ఫ్యాన్ కింద నిలబడి సైకిల్ లో విహారయాత్ర చేస్తున్నాడని 2029కి అందరూ ఫ్యాన్ కిందకి రావాల్సిందే అని ఆయన జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తపల్లిలో ఉర్దూ బాలికల జూనియర్ కళాశాల మంజూరైందని ప్రకటించుకున్న నాయకులు రెండేళ్లుగా వాటిని జీవో కాగితాలకి పరిమితం చేశారని, తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఒకటే అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై వ్యక్తిగత దాడులు చేయడం తప్ప మరేది రాదన్నారు.
రాయచోటి ప్రాంత ప్రజలు కోలుకోలేని దీనావస్థలో ఉన్నారని, కూటమి ప్రభుత్వం కొత్త సంవత్సరం రాయచోటి ప్రజలను కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. ప్రచారంలో రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని తెలుగుదేశం నమ్మ బలికిందన్నారు. నూతన సంవత్సర వేడుకలకు, సంక్రాంతి వేడుకలకు వ్యాపారాలు లేక రాయచోటి వెలవెలబోయింది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రంజాన్ పండుగ సైతం చేసుకుంటారో? లేదో? చూడాల్సి ఉందన్నారు..రాయచోటికి ఏమి చేయని తెలుగుదేశం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఎన్నిక సమయంలో కొత్తపల్లి ప్రాంతంలో 50 పడకల ఏసీ మేటర్నిటీ హాస్పిటల్ చేస్తామని చెప్పిన నాయకులు నేటి వరకు పట్టించుకోలేదని చెప్పారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే సొంత నిధులతో ఏర్పాటు చేస్తామన్న పాలకులు కొత్తపల్లి వైపు వెళ్లకుండా మొహం చాటేశారన్నారు. ఆసుపత్రి ఏర్పాటు నోటి మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లలో రెండేళ్లు కరోనాతో ఉండగా మూడేళ్లలో రాయచోటి అభివృద్ధి పరుగులు పట్టించిందని ఆయన అన్నారు. రాయచోటిలో ఎక్కడో నీళ్ల ట్యాంక్ కింద చిన్న రూములో ఉండే మున్సిపల్ కార్యాలయాన్ని నేడు ఇంత పెద్ద కార్యాలయం ఏర్పాటు చేయడం... చిన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం శ్రీకాంత్ రెడ్డికే సాధ్యమైందన్నారు. ఎన్నికలు వచ్చాయి... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది... . రాయచోటికి మంత్రి పదవి దక్కింది అని సంబరపడిపోయాం.... సంతోషించాం... కానీ ఇంత పెద్ద వెన్నుపోటు పొడుస్తారని ఊహించలేకపోయామన్నారు. జిల్లా కేంద్రం ఎక్కడికి పోదు ఇది కేవలం వైఎస్ఆర్సిపి ఆరోపణలు మాత్రమే అని చెప్పిన పాలకులు చెక్పోస్ట్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి డబ్బులు బాజా బజంత్రీలు కొట్టి థాంక్యూ సీఎం అంటూ ర్యాలీ నిర్వహించి తొడలు కొట్టిన నాయకులు జిల్లా కేంద్రం పోతే ఏం చేశారని ప్రశ్నించారు? . రాయచోటి అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కల్లిబోల్లి మాటలు చెబుతున్న పాలకులు రెండేళ్ల నుంచి ఒక అభివృద్ధి పని ఏమైనా చేశారా అని ప్రశ్నించారు.? గత ప్రభుత్వంలో నగరవనం, శిల్పారామం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా స్టేడియం ల పనులు చివరి దశకు చేరుకున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడికక్కడే ఆగిపోయాయన్నారు. . గత ప్రభుత్వంలో జిల్లా కేంద్రమైనా రాయచోటి పట్టణం సుందరీకరణ లో భాగంగా ఏర్పాటైన సర్కిల్ 100 శాతం పనులు పూర్తి చేసుకుంటే కేవలం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించలేకపోతున్నారని, ఇంకా కొత్తగా ఏమి చేస్తారని ప్రశ్నించారు
ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మయాన నవాజ్ పాల్గొన్నారు.