logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

లిఫ్ట్ ఇరిగేషన్ పై మరోసారి అసెంబ్లీలో గళాన్ని వినిపించిన ఎమ్మెల్యే ఎంజీఆర్

AIMA న్యూస్ :
*వంశధార ప్రాజెక్టుకు భూములు ఇచ్చి రైతులు చాలా నష్టపోయారు*

*వంశధార,మహేంద్ర తనయ నదులపై అవసరం ఉన్నచోట ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయాలన్న ఎమ్మెల్యే గారు*

*మూడు పంటలు పండే పల్లపు భూములు ప్రాజెక్టుకు పోగా శివారు ఉన్న పంట పొలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ లే దిక్కని వివరించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు*

*గత ఐదు సంవత్సరాలు వ్యవసాయం తోపాటు లిఫ్ట్ ఇరిగేషన్లను గాలికి వదిలేసిన వైసిపి ప్రభుత్వం*

*ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్లకు మరమ్మతుల కొరకు నిధులు తోపాటు కొత్త ఇరిగేషన్లను తక్షణమే మంజూరు చేయాలని విన్నవించిన ఎమ్మెల్యే గారు*



*పాతపట్నం నియోజకవర్గం ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ప్రస్తుతం పంటలు పండక చాలా మంది రైతు కుటుంబాలు చెన్నై,హైదరాబాదు వంటి నగరాలకు వలస వెళ్లి పోతున్నారని అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రధానంగా ఉన్న వంశధార,మహేంద్ర తనయ నదులపై అవసరమున్న చోట శివారు ప్రాంతాలకు కూడా సాగునీరు అందించేందుకు గాను లిఫ్ట్ ఇరిగేషన్లను మంజూరు చేయాలని అసెంబ్లీలో మరోసారి తన గళాన్ని వినిపించిన పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు,అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ శ్రీ మామిడి గోవిందరావు గారు ముఖ్యంగా మూడు పంటలు పండిన భూములను వంశధార ప్రాజెక్టుకు రైతులు త్యాగం చేయడం జరిగిందని మిగిలిన శివారు భూములకు వర్షాధారమే దిక్కని కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి వంశధార,మహేంద్ర తనయ నదులపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లను మంజూరు చేస్తూ గత ఐదు సంవత్సరాలు వ్యవసాయాన్ని,ఇరిగేషన్ ప్రాజెక్టులను వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మరమత్తులకు గురైన కారణంగా మన ప్రజా ప్రభుత్వం తక్షణమే స్పందించి పాత ప్రాజెక్టులకు రిపేరుకు నిధులు మంజూరు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయాలని విన్నవించారు ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గంలో పెద్ద సీది,తిడ్డిమి,సీతారామ పల్లి, బోరుభద్ర,పెద్దమల్లిపురం తోపాటుగా మరికొన్ని ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయాలని స్పీకర్ ద్వారా సంబంధిత మంత్రి వర్యులకు,ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారు విన్నవించడం జరిగింది*

0
288 views

Comment