logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో బుయ్యారం గ్రామంలో గుడుంబా స్థావారాలపై ప్రత్యేక దాడులు

25.02.2026(హైదరాబాద్ ):

అక్రమ గుడుంబా తయారీ నిర్మూలనకు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు.

రామగుండం పోలీస్ కమీషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని నీల్వాయి పోలీస్ స్టేషన్‌ ఎస్‌ఐ జగదీశ్వర్ రెడ్డి మరియు చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిపి సుమారు 40 మంది కలిసి బుయ్యారం గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 20 గుడుంబా తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు నిర్వహించి, సుమారు 5,000 లీటర్ల పులియబెట్టిన బెల్లం మిశ్రమం (గుడుంబా పానకం)ను ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా సీఐ కృష్ణ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ., అక్రమంగా గుడుంబా తయారీ మరియు విక్రయాలు చట్ట విరుద్ధమని తెలిపారు. అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనవద్దని సూచించారు. గుడుంబా తయారీలో ఎవరైనా పాల్గొంటే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ,ఎస్‌ఐ జగదీశ్వర్ రెడ్డి, చెన్నూరు ఎక్సైజ్ సిఐ హరి, మంచిర్యాల డీటీఫ్ సీఐ సమ్మయ్య, చెన్నూరు ఎక్సైజ్ ఎస్సై రమణ, బెల్లంపల్లి ఎక్సైజ్ ఎస్సై శారద, సిబ్బంది పాల్గొన్నారు.

7
4120 views

Comment