ఫిబ్రవరి 17 నుండి 23 వరకు జరిగిన టిబి వారోత్సవాలు
వరల్డ్ టిబి డే మార్చి 24 సందర్భంగా టిబి వారోత్సవాలు 17 నుండి 23వరకు టీబీ వారోత్సవాలు నిర్వహించారు.
ఇటీవల సాలూరు లో గర్ల్స్ హాస్టల్ లో ఉన్న విద్యార్థులు కు టిబి పై అవగాహన చేసి టిబి స్క్రీనింగ్ చెయ్యటం జరిగింది.
టిబి లక్షణాలు : రెండు వారలకు మించి దగ్గు, జ్వరం , దగ్గేటప్పుడు కఫం ద్వారా రక్తపు జీరలు పడటం, బరువు తగ్గడం , ఇలాంటి లక్షణాలు ఎవరికి కనిపించినా వెంటనె దగ్గర లో ఉన్న వైద్య సిబ్బంది కి లేదా హాస్పిటల్ కి వెళ్లి టిబి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి .
అలాగే టిబి ముక్తి భారత్ అభియాన్ లో భాగంగా నిక్షయ్ మిత్రగా రిజిస్టర్ అయ్యి టిబి పేషెంట్ ను ఎవరైనా దాతలు దత్తత తీసుకొని వాళ్ళకు ప్రతి నెల పోషకాహారం అందించే కార్యక్రమం కూడా జరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నరేష్ టిబి సూపర్వైజర్, ఏఎన్ఎం,ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది.