logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్.,

తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిబ్రవరి 25:( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
******************************

తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ తొలి రోజు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించబడినట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా క్రమబద్ధంగా నిర్వహించబడినట్లు తెలిపారు .ఈ సందర్భంగా పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల, పాల్వంచ లోని పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును సమగ్రంగా పరిశీలించారు. ప్రశ్నాపత్రాల భద్రతా పంపిణీ విధానం, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియ, ఇన్విజిలేషన్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలను సమీక్షించి, పరీక్షలు పారదర్శకంగా నిర్వహించబడు తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించ బడినట్లు తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగాలు కలిపి మొత్తం 9,685 విద్యార్థులు ఉండగా , అందులో 9,210 మంది పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. జనరల్ విభాగంలో 7,973 మందికి విద్యార్థులు ఉండగా , 7,683 మంది హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,712 మంది ఉండగా, 1,527 మంది హాజరయ్యారు. మొత్తం 475 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు.పరీక్షల సందర్భంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షా కేంద్రాలలో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రతా చర్యలు తదితర అన్ని మౌలిక వసతులు సమృద్ధిగా కల్పించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు . తదుపరి రోజుల్లో నిర్వహించనున్న పరీక్షలు కూడా ఇదే విధంగా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ పరిశీలనలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

114
3054 views

Comment