logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రెండు కిలోల గంజాయి స్వాధీనం-ఇద్దరు అరెస్ట్.

నంద్యాల (AIMA MEDIA): జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు, నంద్యాల SDPO ఎం.జావళి పర్యవేక్షణలో, నంద్యాల జిల్లా, నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వారి సిబ్బంది కలిసి నంద్యాల టౌన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.వారి నుండి సుమారు 2 కే‌జిల గంజాయిని మరియు రెండు సెల్ ఫోన్లను స్వాధీనము చేసుకున్నారు.జగజ్జనని నగర్ చెరువుకట్ట వద్ద దాసరి కళ్యాణ్,మాందాపురం మనోహర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన నంద్యాల 1వ పట్టణ పోలీసులు.వైజాగ్ సమీప అరకులో కిలో రూ 4,000 లకి గంజాయి కొనుగోలు చేసి,నంద్యాలలో 100 గ్రాముల ప్యాకెట్ రూ 2,000 లకి విక్రయం..యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఏ.ఎస్పీ జావళి ఆల్ఫోన్స్.అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆమె తెలిపారు.గంజాయి విక్రయాన్ని అడ్డుకుని నిందితులను పక్క సమాచారంతో పట్టుకున్న నంద్యాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ G. సుధాకర్ రెడ్డిని, వారి సిబ్బందిని నంద్యాల జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

0
24 views

Comment