logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మాస్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన *DM&HO డాక్టర్ తుకారం రాథోడ్

Telangana state* bhadradri Kothagudem district* February 25th (aima media pratinidhi)
********************************
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నందు బుధవారం నాడు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ తెలంగాణ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మాస్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ల సమావేశం నిర్వహించబడింది. జిల్లాలోని ప్రతి పాఠశాలలు, హాస్టళ్లు మరియు కళాశాలలను సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, అంటువ్యాధుల నివారణ వంటి అంశాలపై బోధనలు నిర్వహించాలని ఆయన సూచించారు.ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో హెల్త్ ఎడ్యుకేటర్ల పాత్ర అత్యంత కీలకమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో నాగలక్ష్మి, చింగోజి ఆఫీస్ సూపరింటెండెంట్, సోమ్లా సిహెచ్ఓ, హెల్త్ ఎడ్యుకేటర్లు బేబీ ,జయలక్ష్మి, అమ్మని ,లక్ష్మీబాయి, కృష్ణవేణి, రమాదేవి , లీలా మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

129
2999 views

Comment