logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బి.బి.పట్నం జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా ప్రాంగణ అభివృద్ధికి గ్రామంవారి ఉదార సహకారం

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బి.బి.పట్నం గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ (ZPHS B.B.పట్నం)లో క్రీడా ప్రాంగణాన్ని మట్టితో నింపి, చదును చేయడానికి అత్యవసర నిధుల సమీకరణ, సమన్వయ కార్యక్రమానికి ఉపాధ్యాయ సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేసిన స్వాగత గ్రూపులో గ్రామ పెద్దలు, ట్రాక్టర్, JCB ఓనర్లు చురుకుగా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయకుల ఆహ్వానంతో ఈ రోజు జరిగిన సమావేశంలో హాజరైన అందరికీ, అనివార్య కారణాల వల్ల దూరంగా ఉన్నా తమ సమ్మతి తెలిపిన గ్రామ పెద్దలకు పాఠశాల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ బృహత్కార్యానికి మొదటిగా ముందుకు వచ్చిన బి.బి.పట్నం గ్రామ JCB, ట్రాక్టర్ ఓనర్లు 100 ట్రాక్టర్ల మట్టిని ఉచితంగా అందజేస్తామని ప్రకటించి, లక్ష్యాన్ని మరింత సమీపంలా చేశారు. వీరిలో JCB ఓనర్ దువ్వనబోయిన బాబూరావు కుమారుడు నాగేంద్ర , గ్రామ సర్పంచ్ గరగా విశ్వేశ్వరరావు, అధికారి తాతారావు, అధికారి అప్పారావు కుమారుడు కుర్మారావు, దువ్వనబోయిన తాతబాబు కుమారుడు లోవరాజు గారులు సమిష్టిగా ముందుంచిన ఈ సహకారం అక్షర దేవాలయం పురోగతికి వెలుగు జ్యోతి. మొత్తం ఐదుగురు దాతల సహాయంతో 100 ట్రాక్టర్ల మట్టి సమకూరుస్తుందని యాజమాన్య కమిటీ సంతోషం వ్యక్తం చేసింది.పాఠశాల, విద్యార్థుల, ఉపాధ్యాయుల తరపున ఈ దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన యాజమాన్య కమిటీ, ఈ స్ఫూర్తిని మరింత విస్తరింపజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. "నేటి మీ ఉదారత రేపు మన పిల్లల గెలుపుకు బలమైన పునాది" అని పేర్కొంటూ, గ్రామవారి భాగస్వామ్యం 'వెలకట్టలేనిది'నని ప్రశంసించారు.

43
1107 views

Comment