logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇంటర్మీడియట్ విద్యార్థులకు (ఆల్ ది బెస్ట్)శుభాకాంక్షలు తెలిపిన కొత్తగూడెం డిఎస్పి *ఎల్ ఆదినారాయణ*

తెలంగాణ స్టేట్*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*
ఫిబ్రవరి 25*(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

ఇంటర్మీడియట్ విద్యార్థులకు (ఆల్ ది బెస్ట్)శుభాకాంక్షలు తెలిపిన కొత్తగూడెం డిఎస్పి *ఎల్ ఆదినారాయణ*

నేటి నుండి(బుధవారం) ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గంలోని విద్యార్థినీ, విద్యార్థులందరికీ కొత్తగూడెం *డిఎస్పి ఎల్ ఆదినారాయణ* హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రియమైన విద్యార్థులారా పరీక్షలు అనేవి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక చక్కని అవకాశం. ఎటువంటి ఆందోళన, భయం లేకుండా ప్రశాంత చిత్త శుద్ది తో పరీక్షలు రాయండి. కష్టపడి చదివిన చదువుపై నమ్మకం ఉంచండి. క్రమశిక్షణతో, ఏకాగ్రతతో పరీక్షలు రాసి మీ తల్లిదండ్రులకు, గురువులకు మరియు మన కొత్తగూడెంకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.
మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, మీ లక్ష్యాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

75
3424 views

Comment