logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హెల్మెట్ ధరించిన వారికి పుష్పాలు… లేనివారికి హెల్మెట్ పంపిణీ. ప్రాణ భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి.

25.02.2026(హైదరాబాద్ ):
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల చివరి వారం నిర్వహించే “అరైవ్–అలైవ్” రెండవ విడత కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మున్సిపల్ టీ జంక్షన్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ “అరైవ్–అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై,రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని ప్రజలకు, వాహనదారులకు వివరించారు.హెల్మెట్ ధరించి వచ్చిన వాహనదారులకు పుష్పాలు అందించి అభినందించారు. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి హెల్మెట్‌లు పంపిణీ చేసి,భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

సీపీ మాట్లాడుతూ., పోలీసులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చలాన్ విధిస్తారని తెలిపారు. అయితే చలాన్ వల్ల పోలీసులకు లాభనష్టం ఏమీ ఉండదని, కానీ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగితే గాయాలు గానీ,ప్రాణ నష్టం గానీ కలిగి మీకూ,మీ కుటుంబానికీ తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.ఇంటి నుంచి వాహనంతో బయటకు వచ్చిన ప్రతిసారి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్‌ను సరిగా ధరించి,సేఫ్టీ లాక్ బిగించి వాహనం నడపాలని తెలిపారు. మీ బంధువులు, స్నేహితులు లేదా పరిచయస్తులు ఎవరైనా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తే వారికి కూడా హెల్మెట్ వినియోగం తప్పనిసరిగా చేయాలని తెలియజేయాలని కోరారు.ప్రాణ భద్రత కోసం ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్,మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, వన్‌టౌన్ ఎస్సైరమేష్ రాముని, ట్రాఫిక్ ఎస్సై హరిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

28
8791 views

Comment