మెట్‌పల్లిలో బుర్ర శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి సహాయం
మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) మెట్పల్లి, ఫిబ్రవరి 24:
బుర్ర శ్రీనివాస్ గౌడ్, వేరె గ్రామం నుండి మెట్పల్లికి వలస వచ్చినవాడు, కుటుంబ పోషణ కోసం పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. కానీ హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆయన మృతి చెందారు. ఈ దుఃఖకర సంఘటన కుటుంబంలో తీవ్ర విశాదాన్ని సృష్టించింది.
అంత్యక్రియలకు సహాయ సహకారాలు అందించడానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్, మెట్పల్లిలోని శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ. 5,000 విలువ చేసే కట్టెలు మరియు 25 రైస్ బ్యాగ్‌లను అందించింది. ఈ చర్య ద్వారా కుటుంబానికి ఆర్థిక సహాయం మరియు మానసిక సాంత్వన అందింది.