సీఎం కప్ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ లో భద్రాద్రి జిల్లా విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్
24.02.2026(భద్రాచలం )
సీఎం కప్ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో గెలుపొందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణిలను జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మొత్తం 54 పతకాలు సాధించగా, అందులో 15 బంగారు పతకాలు, 19, రజత పతకాలు, 20 కాంస్య పతకాలు వచ్చినట్లు తెలిపారు. ఇదేవిధంగా క్రీడాకారులు ఇంకా ఎన్నో పతకాలను తీసుకువచ్చి మన జిల్లాకు,రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.
ఈ సందర్భంగా క్రీడాకారులు, జిల్లా కలెక్టర్ కి మరియు స్పోర్ట్స్ ఆఫీస్ పరంధామ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ జివి రామిరెడ్డి, కోచ్ కావేటి రమేష్, సీనియర్ అసిస్టెంట్ తిరుమల రావు, మరియు జిల్లా క్రీడాకారిణులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.