logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

🔴 అనుమానాస్పద మృతి హత్యగా తేలింది… ఎర్దండి గ్రామంలో ఆరుగురు అరెస్ట్

మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 24/02/2026:

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులో ఈ నెల 20న మొగిలిపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల లింబాద్రి (51) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన హత్యగా తేలింది.

గ్రామపంచాయతీ కార్యదర్శి మనోజ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఎస్సై జి. నవీన్ కుమార్, మెట్‌పల్లి సిఐ వి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిపి ఇది మర్డర్‌గా నిర్ధారించారు.

ఈ కేసులో ఎర్దండి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల లక్ష్మి, ఎర్రోళ్ల లితిప్, కల్లెడ నరేందర్, బోదాసు సంతోష్, కల్లెడ వర్షిత్, కల్లెడ సంపత్ అనే ఆరుగురిని ఫిబ్రవరి 23న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

నిందితుల వద్ద నుంచి రెండు ఇనుప స్టేజ్ పైపులు, మూడు బండ్లు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

238
12489 views

Comment