logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కరకగూడెం మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం కోసం సర్పంచ్ కి వినతి పత్రం సమర్పించిన ఆటో యూనియన్ సభ్యులు

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **కరకగూడెం మండలం**ఫిబ్రవరి 24 ఏఐఎంఎ మీడియా ప్రతినిధి


కరకగూడెం మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం కోసం సర్పంచ్ కి వినతి పత్రం సమర్పించిన ఆటో యూనియన్ సభ్యులు

*పబ్లిక్ టాయిలెట్లు లేని కారణంగా ఇబ్బందులు పడుతున్న మహిళలు, వృద్ధులు,

*ప్రతిరోజు వందలాదిమంది మహిళలు బ్యాంకుల పనుల కొరకు ఇతరత్రా ప్రయాణాల కొరకు మండల హెడ్ క్వార్టర్ కి వస్తారూ,

*పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతున్న గ్రామీణ ప్రాంతాల మహిళలు పట్టణ మహిళలు,

*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్,ఆటో యూనియన్ నాయకులు స్థానిక సర్పంచుకు మెమోరాండం అందజేయడం జరిగింది,



కరకగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం నాడు కరకగూడెం ఆటో యూనియన్ (రిజి. నెం. 125/A) కమిటీ సభ్యులు సర్పంచ్ పోలేబోయిన సుజాత ను కలిసి కరకగూడెం మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ల మంజూరు మరియు నిర్మాణం కోసం వినతి పత్రం సమర్పించారు...మండల హెడ్ క్వార్టర్ అయిన కరకగూడెం లో బ్యాంకులు, ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ముఖ్య కార్యాలయాలు ఉండటం వల్ల ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే పబ్లిక్ టాయిలెట్ల సదుపాయం లేకపోవడం వల్ల ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యూనియన్ సభ్యులు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో ప్రజల అవసరాన్ని గుర్తించి తక్షణమే పబ్లిక్ టాయిలెట్లను మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ ను సవినయంగా కోరారు..

*ఈ కార్యక్రమంలో*
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఆటో యూనియన్ సభ్యులు, వ్యాపారస్తులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు..

24
1110 views

Comment