కంచర్ల హిమశ్రీని ఘనంగా సన్మానించిన సిపిఐ మహిళా సమాఖ్య
తెలంగాణ స్టేట్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* కొత్తగూడెం టౌన్ *ఫిబ్రవరి 24 *(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
18 వ డివిజన్ కార్పోరేటర్ గా గెలుపొందిన కంచర్ల హిమశ్రీని ఘనంగా సన్మానించిన మహిళ సమాఖ్య
*18వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ,
*18వ డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధిని తీసుకురావడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం కంచర్ల హిమశ్రీ,
*నాకు జరిగిన ఈ సన్మానం మీ అందరి కృషి,
అధికార పార్టీతో పోటీపడి అధిక సీట్లు గెలుపొందడం ఆషామాషీ కాదు,
ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు భరిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను సమాయత్తం చేస్తూ కార్పొరేషన్ బరిలో పోటీలో నిలిచి కొత్తగూడెం కార్పొరేషన్లు సిపిఐ గా పోటీ చేయడమనేది ఒక ధైర్య సాహసం అయితే ఒంటరిగా అత్యధిక సీట్లు గెలవడం అనేది చరిత్ర గాక మరేమంటారు,చారిత్రాత్మక మైన ఈ విజయం కార్మికుల కర్షకుల బడుగు బలహీన వర్గాల విజయం గా భావించాల్సి ఉంటుంది,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు , జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా కృషి పట్టుదల ఉద్యమ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి ఈ ఫలితాలు వారు పడ్డ శ్రమకు తగిన ఫలితం
కొత్తగూడెం నగరపాలిక సంస్థ 18వ డివిజన్ కార్పొరేటర్ నిలబడ్డ అతి చిన్న వయసుకురాలిగా గెలుపొందిన యంగ్ డైనమిక్ కంచర్ల హిమశ్రీ ని మరియు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య వీరు ఇరువురిని ఘనంగా సత్కరించిన సిపిఐ మహిళా సమాఖ్య, ఈ సందర్భంగా కంచర్ల జమలయ్య మాట్లాడుతూ వార్డు ప్రజల కు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఇంత గొప్ప విజయం కు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు