logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అంగన్వాడీల మరలా పోరుబాటకు....

చీపురుపల్లి:తమ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు పోరాటం చేపట్టారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.ఈ నెల 23,24 తేదీలలో icds కార్యాలయం వద్ద, 25,26,27 కలెక్టర్ ఆఫీసుల వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టాలని అంగన్వాడీ వర్కర్ల రాష్ట్ర యూనియన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం చీపురుపల్లి ICDS ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు నిరాహారదీక్షలు చేపట్టారు. అనంతరం కార్యాలయం సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, మినీ అంగన్వాడి సెంటర్లను మెయిన్ సెంటర్లగా మార్చాలని, ప్రభుత్వ పథకాలు వర్తించే విధంగా రూపకల్పన చేయాలని, గ్రాట్యూటి అమలుకు గైడ్లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. CITU నాయకులు మద్ధతు తెలిపారు.

22
3182 views

Comment