ఖమ్మం శివారులో టెన్షన్.. టెన్షన్
24.2.2026(ఖమ్మం )
ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమంగా నివసిస్తున్నారంటూ 600 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు వేలాది మంది పోలీసులు వచ్చారు. కాగా కాసేపటి క్రితమే గుడిసెల తొలగింపు ప్రక్రియ మొదలైంది. జేసీబీల సాయంతో గుడిసెలను తొలగిస్తుండడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.