తెలంగాణా కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చ
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
23/2/206(హైదరాబాద్ )
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
మార్చి 16 నుంచి 30 వరకు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు. మార్చి 20న బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరుగుతుంది.
3.56 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పింఛనర్లు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 15.07 లక్షల మందికి
ప్రభుత్వ ఉద్యోగుల జీతంలోని బేసిక్ పే నుండి 1.5శాతం కంట్రిబ్యూషన్‌తో , మరియు ప్రభుత్వం తరపున 1.5 శాతం దాదాపు 1056 కోట్ల రూపాలయలతో ట్రస్ట్ ఏర్పాటు చేసి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని ట్రస్ట్ ద్వారా వారికి వైద్య సేవలు, ఆర్థిక పరమైన సమస్యలు తీర్చాలని నిర్ణయించడం జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేసి 652 ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో 1,998 రకాల వ్యాధులకు చికిత్స.
7.56 లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్లకు సింగరేణి, జెన్‌కో తరహాలో రూ.1.25 కోట్ల వరకు ప్రయోజనం చేకూరేలా బీమా పాలసీ. 60 ఏళ్ల లోపు సహజ మరణం పొందితే శాఖాపరమైన ప్రయోజనాలతో పాటు అదనంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1ను పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, మార్చి 31, 2026 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఫేజ్ 2, 3 పనులను కేంద్ర ప్రభుత్వ వాటాతో చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.
హైదరాబాద్ కు త్రాగునీటికి ఆధారమైన వందేళ్ల నాటి మంజీరా, ఉస్మాన్ సాగర్ పైపులైన్ల స్థానంలో కొత్తవి నిర్మించి, పంపులు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.
కోహెడలో 239 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ ఏర్పాటు కోసం మార్కెట్ కమిటీకి భూకేటాయింపు చేయడానికి కేబినెట్ నిర్ణయం.
మహబూబాబాద్ JNTU కాలేజీకి (70 ఎకరాలు), హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ అనుబంధ కాలేజీకి (36 ఎకరాలు), వివిధ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటుకు (25 ఎకరాలు) భూ కేటాయింపు.
ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాలు. ఇక్కడ ఆలయంతో పాటు స్టేడియం, ఫంక్షన్ హాల్ నిర్మించడానికి అనుమతించడం జరిగింది. భద్రాచలంలో మినీ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంకు 5 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
డేటా సెంటర్ల కోసం 300 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కి ఆమోదం తెలపడం జరిగింది.
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను 'డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్'గా మార్పు. వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మెన్ గా, డాక్టర్ నూరి దత్తాత్రేయ నేతృత్వంలో మెరుగైన వైద్య సేవలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
హైదరాబాద్ నుండి కరీంనగర్ రోడ్డు విస్తరణలో భాగంగా 42 ఎకరాల డిఫెన్స్ భూమికి బదులుగా 153 ఎకరాల భూమిని ఇచ్చి భూసేకరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.