మెట్‌పల్లికి ప్రత్యేక నిధులు కేటాయించాలి...
ముఖ్యమంత్రిని కలిసిన మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి...
మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 24/02/2026:
మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ మరియు నియోజకవర్గ ఇంచార్జ్ జువాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో ఇటీవల మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన మైలారపు లింబాద్రి ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెట్‌పల్లి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధి కోసం అదనపు నిధులు అవసరమని వివరించారు.
వారి విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కూడా పాల్గొన్నారు.
మెట్‌పల్లి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందనే ఆశాభావం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది.