logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

టౌన్ పోలీసులు పాత నేరస్తుడైన ATM మోసగాడిని పట్టుకుని రిమాండ్‌కు తీసుకెళ్లారు.

ఫిబ్రవరి 23: అనకాపల్లి జిల్లా ధర్మసాగరం గ్రామానికి చెందిన 67 ఏళ్ల సకల నూకరాజును ₹1,15,000 మోసం చేసిన పాత నేరస్తుడు మువ్వ వీరయ్య చౌదరి (43)ను నర్సీపట్నం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 17న DBR షాపింగ్ మాల్ దగ్గర పాత ఆంధ్రా బ్యాంకు ATM వద్ద నగదు తీసుకోవడానికి వెళ్లిన నూకరాజు ATM పని చేయకపోవడంతో సహాయం చేస్తానని ముందుకు వచ్చిన ఆ వ్యక్తి కార్డును మూడుసార్లు పెట్టి PIN తెలుసుకుని, వేరే కార్డును ఇచ్చి పారిపోయాడు. డబ్బు డ్రా అయినట్లు తెలిసి బ్యాంకుకు వెళ్లిన నూకరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 1/2026 u/s 318(4), 303(2) BNS కింద కేసు నమోదైంది. DSP ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో క్లూ టీమ్ CCTV ఫుటేజ్ పరిశీలించి వీరస్సపాలెం గ్రామం, ప్రకాశం జిల్లా నివాసి వీరయ్యను గుర్తించింది. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్న ఇతనిపై 2017 నుండి వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నర్సీపట్నం తో పాటు మిర్యాలగూడ, పాలకొండ, ఆమదాలవలస, లాలపేట, జనగాం, కాజీపేట ప్రాంతాల్లో కూడా మోస కేసులు ఉన్నట్లు తెలిసింది.ఫిబ్రవరి 21 ఉదయం SBI మెయిన్ బ్రాంచ్ సమీపంలో మరో మోసానికి సిద్ధమవుతున్న వీరయ్యను సమాచారం మేరకు పోలీసులు పట్టుకుని విచారించారు. విచారణలో అతని నేర చరిత్ర వెలుగులోకి వచ్చింది. అతని వద్ద నుండి ₹10,000 నగదు, తొమ్మిది ATM కార్డులు, ఒక మొబైల్ స్వాధీనం చేసుకుని న్యాయస్థానానికి జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు మరిన్ని క్లూ‌లు సేకరిస్తున్నారు.

13
266 views

Comment