గజపతినగరం లో ఘనంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విజయనగరం జిల్లా పరిధి లో గజపతినగరం పట్టణం లో ఆదివారం వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ వామ్ అధికార ప్రతినిధి ఉప్పల ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సంకల్పించామని వక్తలు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహాలు స్థాపించేందుకు, పేదలకు ఉచితంగా విద్యను అందించేందుకు, ప్రతి ఇంట్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటాలు పంపిణీ చేసేందుకు, అదే విధంగా ప్రతి ఒక్కరికి హుండీలు అందించి ఎంతోకొంత సొమ్మును ప్రతిరోజు అందులో దాచి ఆ సొమ్మును సంఘ అభివృద్ధికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. సమాయత్తమవుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్టేట్ చీఫ్ అడ్వైజర్ బండారు చంద్రశేఖర్, ప్రత్యేక అతిథిగా విజయనగరం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బొండా రమేష్, విశిష్ట అతిథిగా వామ్ స్టేట్ డైరెక్టర్ తవ్వ మోహనరావు, వామ్ స్టేట్ అడ్వైజర్ పూసర్ల మోహన్ రావు, వామ్ విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ జి. ప్రసాద్, వామ్ విజయనగరం టౌన్ సెక్రెటరీ కుమార్ రాజా,వామ్ గజపతినగరం మండల ప్రెసిడెంట్,సాయిబాబా మెడికల్స్ గజపతినగరం ఓనర్ కందుల గుప్తా, ఉప్పల గణేష్, బండారు రామారావు, సి. ప్రతాప్,కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా నుండి పలువురు సభ్యులు హాజరయ్యారు.