జనసేన నాయకుల ఆధ్వర్యంలో జగ్గంపేటలో యువకులకు వాలీబాల్ కిట్‌లు
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం, జగ్గంపేట గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు, మండల కన్వీనర్ లాలం నర్సింగ్ రావు ఆర్థిక సహాయంతో గ్రామ యువకుల వాలీబాల్ జట్టుకు కొత్త కిట్‌లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని జనసేన పార్టీ సీనియర్ నాయకులు వజ్రపు ఈశ్వరరావు, చెరకాపు నానాజీ, చెరకాపు రమేష్, భీమిని చినబాబు, సేనాపతి గోపి లు కలిసి కిట్‌లను జగ్గంపేట పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షుల చేతుల మీదుగా యువకులకు అప్పగించారు.యువకులు లాలం నర్సింగ్ రావుకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్య గ్రామంలో ఆటల పట్ల ఆసక్తిని పెంచుతూ, యువతను క్రీడల వైపు ఆకర్షిస్తోందని నాయకులు పేర్కొన్నారు