logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బావిలో పడి వ్యక్తి మృతి

జర్మనిస్ట్: ఆకుల గణేష్

చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఏకు సారయ్య అనే వ్యక్తి రేగొండ మండలం కొడవటంచలోని ఒక వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ప్రతి వారం శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి వచ్చే సారయ్య, ఈ నెల 17న ఆలయానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బావిలో దుర్వాసన రావడంతో పరిశీలించగా మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

6
1422 views

Comment