logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

లారి ఢీకొని భక్తుడు దుర్మరణం

జర్నలిస్ట్: ఆకుల గణేష్

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని స్వగ్రామానికి వెళ్తున్న భక్తుడు ఆదివారం ఇసుక లారీ ఢీకొని దుర్మరణం చెందాడు. ఏటూర్ నాగారం మండలం రాంనగర్కు చెందిన గొర్లపాటి నవీన్ (40) మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా, 163వ జాతీయ రహదారిపై కామారం క్రాస్ రోడ్ వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

7
1616 views

Comment