రాయపాడు తాటిపర్తి చీకటి కష్టాలు: పెదగరువు కొండదొరలు విద్యుత్ కోరుతున్నారు
అనకా పల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ తాటిపర్తి, పెదగరువు, రాయపాడు గ్రామంలో 70 కుటుంబాలు PVTG కొండదొర తెగలు జీవిస్తున్నారు. పగలు విద్యుత్ లభిస్తుంది కానీ రాత్రి అయితే పూర్తి చీకటిలోనే భోజనం చేసుకుంటూ బతుకుతున్నారు.దట్టమైన అడవి ప్రాంతాలకు దగ్గరలో ఉండటంతో పాములు, జంతువులు ఎప్పుడైనా దాడి చేసే ప్రమాదంతో భయంగా జీవిస్తున్నారు. విద్యుత్ లైన్‌మెన్‌లకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. "సాయంత్రం అయితే చీకట్లో బతుకుతున్నాం. తక్షణమే విద్యుత్ సౌకర్యం కల్పించాలి" అని గ్రామస్తులు యు. బాలరాజు మరియు గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నారు.