logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో రమజాన్ కిట్లు వితరణ.

నంద్యాల (AIMA MEDIA): ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం జమాఆతె ఇస్లామీ హింద్, నంద్యాల శాఖా 'రమజాన్ కిట్లు' పంపిణి చేసింది. గోల్డెన్ బేకరి పై అంతస్తులో జరిగిన 'కిట్ల వితరణ' కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షులు అబ్దుల్ సమద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా సమద్ మాట్లాడుతూ ప్రతి రమజాన్ మాసంలో దాతల సహకారంతో పేద ముస్లింలకు కిట్లు పంచడం ఆనవాయితి. ఈ సంవత్సరం కూడా ముందుగా గుర్తించిన రెండు వందల యాభై మందికి బియ్యం, మంచి నూనే తదితర పదమూడు రకాల ఆహార దినుసులు గల కీట్లు పంపిణి చేసారు. గోల్డెన్ బేకరి వారు రూ. 1200/- విలువ గల ప్యాకెట్ రు. 1000/- కే తయారు చేసి ఇచ్చినందుకు సమద్ అభినందించారు. దైవ ప్రసన్నత కోసం నేడు రెండున్నర లక్షల విలువైన కిట్లు పంచడం సంతోషకరమని ఈ పవిత్ర కార్యంలో చేయూత ఇచ్చిన దాతలకు సహకరించి క్యాడర్ కు సమద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు హాఫీజ్ షోయబ్ జమా, పివి ముస్తఫా, సీ.యం.జకరియా, ముహమ్మద్ ఫయాజ్, విశ్రాంత లెక్చరర్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడారు. ఇంకా ఎస్ఐఒ ప్రెసిడెంట్ అబ్దుల్లా, బ్రదర్ ఇందాదుల్లా, ఖాజా, గోల్డెన్ బేకరి అపఫ్రోజ్, దాదాపీర్ తదితరులు పాల్గొన్నారు.జకాత్ చెల్లింపుకు అప్పీల్ జమాఆతె ఇస్లామి హింద్ వివిధ కార్యక్రమాల ద్వారా నిరంతరం ప్రజలకు సేవ చేస్తుందని, ఇస్లాంలో అర్హులు జకాత్ తప్పక చెల్లించాలి. మీ జకాత్ లో కొంత భాగం జమాఆతె ఇస్లామీ కి చెల్లించవలసిందిగా ముస్లీం ప్రజానీకానికి అనీల్ చేసారు.

0
0 views

Comment