logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సంతానం లేని దంపతులకు శుభవార్త.. ఆళ్లగడ్డ డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ (శివమ్మ హాస్పిటల్) నందు ఆదివారం నాడు కర్నూలు ఆదిత్య టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ద్వారా సంతానం లేని దంపతుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరంను ప్రత్యేకంగా నిర్వహించారు.
కర్నూలు లోని ఆదిత్య టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సౌజన్యంతో ఆ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ తిరుపాల్ రెడ్డి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనీషా, డాక్టర్ శివ నాగేశ్వరమ్మ, వెంకటసుబ్బారెడ్డి ఆసుపత్రి ఎం.డి డాక్టర్ నరసింహారెడ్డి పాల్గొని దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యవేక్షకులు డాక్టర్ కే. తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు లేరని చింత ఇక వలదని తెలిపారు. సరైన శాస్త్రీయ పద్ధతి చికిత్స ద్వారా సంతానాన్ని పొందే అవకాశం తమ ఆసుపత్రి ద్వారా కల్పిస్తామన్నారు. దాదాపుగా 15 సంవత్సరాల నుండి ఆళ్లగడ్డలో మూడు నెలలకు ఒకసారి ఈ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు . తమ వద్ద దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న వారందరికీ సంతాన భాగ్యం కలిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో MD డాక్టర్ సారెడ్డి నరసింహారెడ్డి, డాక్టర్ యశ్వంత్ రెడ్డి, డాక్టర్ శివమ్మ, డా.హనీషా రెడ్డి, దాదాపుగా ఆళ్లగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల వారు50 మంది పేషెంట్లు పాల్గొన్నారు.

29
1005 views

Comment