logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*అభివృద్ధిలో మేము సైతం.

*అభివృద్ధిలో మేము సైతం..*

*పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు తీసుకున్న సంకల్పం ప్రజల్లో విశేష స్పందన రేపుతోంది. ఆయన అభివృద్ధి దృక్పథం చూసి ఆయన సన్నిహిత మిత్రులు కూడా “అభివృద్ధిలో మేము సైతం భాగస్వాములం” అంటూ ముందుకు రావడం పాతపట్నం ప్రజలకు ఆనందదాయక విషయం...*

*పాతపట్నం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారి సన్నిహితులు సుమారు రూ.11 లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు...*

*ఇందులో భాగంగా, ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్న ఎర్ర చెరువు పార్క్ వద్ద “🩷I LOVE YOU PATHAPATANAM🩷” గుర్తు నిర్మాణానికి ఆయన సన్నిహిత మిత్రులైన పడ్డ లోకేశ్వరరావు, రెంటి కోట మాధవరావు, శ్రీరామ్ రమణ గారు సుమారు మూడు లక్షల రూపాయలతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.ఈ నిర్మాణానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు శంకుస్థాపన చేసి ప్రారంభించారు..*

*అలాగే పాతపట్నం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా సుమారు రూ.8 నుండి 10 లక్షల వ్యయంతో ఆడిటోరియం నిర్మాణానికి రెంటికోట మాధవరావు గారు ముందుకు రావడం విశేషం. ఈ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి..*

*ఎమ్మెల్యే గారి అభివృద్ధి పిలుపుకు స్పందిస్తూ ఆయన సన్నిహితులు ముందుకు రావడం పాతపట్నం అభివృద్ధికి నూతన దిశను చూపుతోంది.పాతపట్నాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకులు,కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గేదెల బాలకృష్ణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..*

0
0 views

Comment