తిరుమల పవిత్రతను దెబ్బతీసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్
*▪️“దేవుడితో నీచ రాజకీయాలు మానాలి – హిందూ విశ్వాసాల పట్ల వైసీపీ క్షమాపణ చెప్పాలి” - ఎమ్మెల్యే ఎంజిఆర్ గారు...*
*▪️తిరుమల పవిత్రతను దెబ్బతీసిన ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు...*
*▪️జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు...*
*▪️పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు జిల్లా పార్టీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ పాలనలో హిందూ విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రతను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) వ్యవహారాల్లో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు.టీటీడీ నిధుల వినియోగం, దర్శన టిక్కెట్ల వ్యవహారాలు, ఆలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలపై వైసీపీ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపకపోవడం బాధాకరమన్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణలో గత ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.తిరుమల సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలను గౌరవించకుండా వ్యవహరించడం వల్ల కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం సరికాదని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.“ఏ మతమైనా గౌరవించాలి. దేవుడిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం మానుకుని, చేసిన తప్పులకు ప్రజలకు మరియు భక్తులకు క్షమాపణ చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు.హిందూ ధార్మిక సంస్థల ఆస్తుల పరిరక్షణకు, ఆలయాల గౌరవాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, బిజెపి అధ్యక్షులు జనసేన అధ్యక్షులు, జిల్లా ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు..*