నాన్న బాటలో*ఐటీడీఏ పీవో బి రాహుల్ ...!
*క్రీడలపై పిఓ ఫోకస్*
*తెలంగాణ స్టేట్*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
*భద్రాచలం ఐ టి డిఏ న్యూస్ ఫిబ్రవరి 21*(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
*నాన్న బాటలో* ...!
*క్రీడలపై పిఓ ఫోకస్*
- *భారీగా నిధులు వెచ్చింపు*
- *క్రీడా పరికరాలు కొనుగోలు*
- *గిరి బిడ్డలు క్రీడల్లో రాణింపు*
- *సత్ఫలితాలిస్తున్న పీవో రాహుల్ చర్యలు*
నాన్న వ్యాయామ ఉపాధ్యాయులు. అందుకేనేమో కాబోలు తనకు కూడా నాన్న పోకడలే వచ్చాయి. క్రీడలు అంటే మహా ఇష్టం. గిరి బిడ్డలను ఛాంపియన్లలను చేయాలన్నది ఆయన కల.అందుకే మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నారు.క్రీడా ప్రగతికి కంకణ బద్ధులై కర్తవ్య సాధనకకై కదం తొక్కుతున్నారు. తాను ఆటలాడుతూ...బడి పిల్లలను ప్రోత్సహిస్తున్నారు.
గిరిజన సమగ్ర అభివృద్ధిలో నూతన ప్రయోగాలతో ఇప్పటికే తన మార్కు చూపించిన భద్రాచలం ఐటిడిఏ పిఓ బి.రాహుల్ ఐఏఎస్ క్రీడాభివృద్ధికి సైతం పూనుకోవటంతో గిరిజన విద్యాసంస్థల్లో క్రీడా వికాసం పరిఢవిల్లుతోంది
*క్రీడా ప్రగతికి పిఓ ఫోకస్* ...
భద్రాచలం ఐటీడీఏ పీవో బి రాహుల్ ఐఏఎస్ తండ్రి వ్యాయామ ఉపాధ్యాయులు. దీంతో చిన్నప్పటినుంచి రాహుల్ పై క్రీడా ప్రభావం పడింది. తనకు కూడా క్రీడలు అంటే మహా ఇష్టం కావడంతో ఇప్పటికీ తాను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రతీరోజు ఆటలాడటం మాత్రం మానరు. స్వతహాగా క్రీడాకారుడు కావడంతో గిరిజన విద్యా సంస్థల్లో కూడా క్రీడా ప్రగతికి పిఓ రాహుల్ పూనుకున్నారు.
ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2024-2026 విద్యా సంవత్సరాలలో గిరిజన విద్యార్థుల క్రీడాభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు.ట్రైబల్ వెల్ఫేర్ క్రీడా పాఠశాలలు కచనపల్లి, కిన్నెరసానిలకు 2024వ సంవత్సరంలో రూ.22,00,538 విలువైన క్రీడా పరికరాలు కొనుగోలు చేసి వారికి అందించారు.ఆశ్రమ పాఠశాలలకు రూ.11,65,001, భద్రాచలం వికాసం పాఠశాలకు రూ.6,4,050 నిధులను వెచ్చించి విలువైన క్రీడా పరికరాలు అందించారు.
పిఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ పాఠశాలలకు రూ. 34,29,589 క్రీడా పరికరాలు కొనుగోలు చేసి గిరి బిడ్డలకు అందుబాటులో ఉంచడం గమనార్హం.ఈ క్రీడా పరికరాలు గిరిజన బాలబాలికలకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి.
*గిరి బిడ్డలు చాంపియన్లుగా* ...
గిరిజన విద్యాలయాల్లో అందుబాటులో క్రీడా పరికరాలు ఉండటం, పిఓ నిత్యం క్రీడలపై దృష్టి సారించిన నేపథ్యంలో గిరిజన విద్యార్థినీ,విద్యార్థులు క్రీడల్లో విశేషంగా రాణిస్తూ ఉండటం గమనార్హం. 2024 నవంబర్ 5,6,7 తేదీలలో ఉట్నూర్ నిర్వహించిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలు మరియు 2026 జనవరి 7,8,9 తేదీలలో ఏటూరు నాగారంలో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలలో భద్రాచలం ఐటిడిఏ రెండుసార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించటం విశేషం.ఈ సంవత్సరం హ్యాండ్ బాల్, ఫుట్ బాల్, బాల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, టెన్నికాయిట్,హాకీ వంటి క్రీడలకు కూడ అవసరమైన పరికరాలు ఏ.హెచ్.ఎస్ పాల్వంచ, పార్కల గండి,ఉప్పుసాక, బొజ్జయిగూడెం, రేగళ్ల తండా, భద్రాచలం, ఆర్లగూడెం, కే. రేగుపల్లి, కమలాపురం, ఏ.జి.హెచ్.ఎస్ ఉప్పుసాక, కేజీబీహెచ్.ఎస్ పెద్ద మెడిసి లేరు, ఏ.జి.హెచ్.ఎస్ అంకంపాలెం, గౌరారం, కేఎన్ పురం, గొల్లగూడెం పాఠశాలలకు క్రీడా పరికరాలు అందించడం ద్వారా విద్యార్థిని,విద్యార్థులు గుజరాత్లో జరిగిన జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలలో విగ్నేష్ రేగల్ల తండ మరియు హాకి విభాగములో సుగుణ గౌరారం న్యూడిల్లిలో పాల్గొని మెడల్స్ సాధిస్తూ ప్రతిభను చాటారు. గతంలో లేని ఈ క్రీడలను సైతం ఏజెన్సీలో పిఓ ప్రోత్సహించడానికి ముందుకు రావడం గమనార్హం.
*క్రీడాకారుడిగా, క్రీడలను ప్రోత్సహిస్తూ* ...
భద్రాచలం ఐటిడిఎ పి.ఓ బి.రాహుల్ ఐఏఎస్ క్రీడాకారుడిగా కూడా రాణిస్తూ క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. రాహుల్ ఐఏఎస్ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ప్రతిరోజు ఖాళీ సమయంలో ప్రాక్టీస్ చేస్తుంటారు. భద్రాచలం ట్రైబల్ మ్యూజియంలో కూడా క్రికెట్ తో పాటు అనేక క్రీడలను పిల్లలు ఆడుకునేందుకు అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. బాల్ బ్యాడ్మింటన్,షటిల్ కోర్ట్ లను కూడా ఏర్పాటు చేశారు.ఐటీడీఏ ప్రాంగణంలో జరిగిన అవుట్ డోర్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్లో పివో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయులు,ఉద్యోగులకు కిన్నెరసాని క్రీడా మైదానంలో జరిగిన క్రీడలలో పిఓ పాల్గొని బహుమతులు గెలిచారు. భద్రాచలంలోని శ్రీ సీతారామ క్లబ్ డే సందర్భంగా నిర్వహించిన క్రీడలలో పాల్గొని బ్యాట్మెంటన్ లో మొదటి బహుమతి, లాన్ టెన్నిస్ లో రెండవ బహుమతి గెలుపొందారు. తన తండ్రి పిడి కావడంతో చిన్నప్పటి నుంచి వివిధ క్రీడలపై అవగాహన ఉండటంతో,గిరిజన విద్యార్థినీ విద్యార్థులను చదువుతోపాటు వివిధ క్రీడలలో నిష్ణాతులు చేయడానికి పాఠశాలలకు ఆకస్మిక తనిఖీకి వెళ్ళినప్పుడు ప్రత్యేక సందర్భాలలో పిల్లలతో క్రీడలలో పాల్గొని వారిని ఉత్తేజపరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో గిరి బిడ్డలు రాణించేందుకు తన వంతు ప్రోత్సాహం అందజేస్తున్నారు.