మెట్‌పల్లి చైర్‌పర్సన్ మైలారపు లింబాద్రికి జనసేన నేతల సన్మానం..
మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 20/02/2026:
నూతనంగా ఎన్నికైన మెట్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ మైలారపు లింబాద్రిను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానించారు.
జనసేన పార్టీ 20వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన అభ్యర్థి వన్నెల రాకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వన్నెల రాకేష్ మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన చైర్‌పర్సన్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. రాజకీయ భేదాభిప్రాయాలు పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిష్కారంలో కలిసి పనిచేయడానికి సిద్ధమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంఠం శివ చరణ్, వన్నెల సాయి కుమార్, మంగ అజయ్, బోడ మారుతి, రామగిరి మణిదీపి, కొంపల్లి సుమంత్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారదర్శక పాలన లక్ష్యంగా చైర్‌పర్సన్ ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.