logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పేదలకో రూల్ పెద్దలకో రూల్ నా



గత కొద్దిరోజులుగా సాలూరు మున్సిపాలిటీకి సంబంధించిన పన్ను బకాయిల రద్దు విషయమై వినిపిస్తున్న వార్తలు నేపథ్యంలో వివరణ కోరుతూ జనసేన పార్టీ తరఫున పత్రిక ముఖంగా ప్రశ్నించడం జరుగుతుంది...
కోట్ల రూపాయలలో పెద్దల పన్నుల బకాయిలను రద్దు చేస్తారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో జనసేన పార్టీ తరుపున తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం... స్థానిక ఎన్నికల ముందు నచ్చినట్లు చేస్తాం నచ్చిన రద్దులు చేసుకుంటాం అంటే సాలూరు ప్రజలు ఊరుకోరు అని గుర్తు చేస్తున్నాం...
దానిలో బడా నాయకులు హస్తము, సహాయంతో కట్టవలసిన పన్నులు రద్దు చేసుకునే విధంగా పావులు నడుపుతున్న పెద్ద పెద్ద వారి పేర్లు తోపాటు వారికి సహకరిస్తున్న మున్సిపల్ అధికారుల యొక్క తీరును ప్రశ్నిస్తూ పత్రిక ముఖంగా జనసేన పార్టీ తరఫున ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని కోరుతున్నాం... ఇదే విషయం పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది ...
పేదల పన్నుల విషయంలో కఠినంగా వ్యవహరించే అధికారులు పెద్దలకు దాసోహం అయ్యి లక్షల రూపాయలు పన్నులు రద్దు చేస్తాము అంటే చూస్తూ ఊరుకునేది లేదు అని తెలియచేస్తున్నాము. జరుగుతున్న ఈ అన్యాయం లో మున్సిపల్ లో ఏ పార్టీ వారున్నా ఈ అన్యాయాన్ని అడ్డుకుంటామని స్థానిక మంత్రి దృష్టికి పార్టీ అధ్యక్షులు పవన్కళ్యాణ్ దృష్టికి పై విషయం తెలియచేసి ఈ కుట్రను కచ్చితంగా అడ్డుకుంటాం అని తెలుపుతున్నాము...
ఈ కార్యక్రమం జనసేన అధ్యక్షులు శివ కృష్ణ జనసేన నాయకులు మీసాల నవీన్, మీసాల సతీష్,మరిపి రవి, బోను హేమంత్, మురళి, చంటి, యుదిస్టార్, మోహన్ తదితరులు పాల్గొన్నారు

312
6275 views

Comment