కుసర్లపూడిలో కిషోర్ వికాసం: బాల్యవివాహాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రావికమతం ప్రాజెక్టు పరిధి రోలుగుంట సెక్టార్ కుసర్లపూడి అంగన్వాడి పరిధిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల్లో కిషోర్ వికాసం ప్రోగ్రామ్‌లో భాగంగా అద్భుతమైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కిశోర బాలికలకు, బాలురకు బాల్యవివాహాలు, వ్యక్తిగత పరిశుభ్రత, కిషోర దశలో ఎదుర్కొంటున్న సమస్యలపై వివరణాత్మక చర్చ జరిగింది.సెక్టార్ సూపర్‌వైజర్ హేమా నేతృత్వంలో అంగన్వాడి సిబ్బంది, జడ్పీహెచ్ఎస్ పాఠశాల హెడ్‌మాస్టర్ మరియు సిబ్బంది అందరూ చురుకుగా పాల్గొని, పిల్లలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం గ్రామీణ పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడంలో ఈ కార్యక్రమంతో దోహదం చేస్తుందని నిర్వాహకులు తెలిపారు