
విద్యార్థుల హక్కుల సాధన కోసం ఛలో విజయవాడ: పి.డి.ఎస్.యు పిలుపు.
నంద్యాల (AIMA MEDIA): ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.6,400 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు డిమాండ్ చేశారు.ఫిబ్రవరి 27న “చలో విజయవాడ” కార్యక్రమాన్ని విద్యార్థులు విజయవంతం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యు) ఆధ్వర్యంలో నంద్యాల లోని బీసీ కాలేజీ హాస్టల్ నందు గోడ పత్రికలను విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ ఉన్నత విద్యార్థుల స్కాలర్షిప్‌లకు శాపంగా మారిన జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 4,200 పోస్టులను భర్తీ చేయాలని కోరారు.పెరిగిన ధరలకు అనుగుణంగా వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్సు మరియు కాస్మోటిక్ చార్జీలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర బడ్జెట్‌లలో విద్యా రంగానికి కనీసం 10% రాష్ట్ర బడ్జెట్ లో 30% వరకు నిధులు కేటాయించాలని కోరారు.ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయని, హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఇవ్వడంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 27న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులు, యువతను పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యు నాయకులు అంజి, దేవేంద్ర,శివ,సతీష్,గిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.