logo

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హార్ట్‌ఫుల్‌నెస్ తరగతులు:

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ప్రతినిధులు
సంజీవరావు, సత్యనారాయణ, విజయలు పాఠశాలను సందర్శించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేషగిరి రావు, ఆంగ్ల ఉపాధ్యాయిని నాగజ్యోతి ప్రతిపాదన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో పాటు 6వ నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు రెండు సెషన్ల వారీగా ప్రత్యేక ధ్యాన-యోగ తరగతులు చేపట్టారు. ఈ తరగతుల్లో యోగా, ధ్యానం, క్రమశిక్షణ, సమయ నిర్వహణ, జ్ఞాపకశక్తి, ఒత్తిడి నియంత్రణ, స్వీయగౌరవం, ధైర్యం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.ప్రతినిధులు విద్యార్థులకు ప్రాయోగికంగా యోగా, ధ్యాన విధానాలు చూపించి, వాటి ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన కీలక విషయాలు నేర్చుకున్నారు.పదవ తరగతి పరీక్షలకు రోజులు దగ్గరలో ఉన్న నేపథ్యంలో, విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించి, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగకరమని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, విద్యార్థుల అభివృద్ధికి ఇది గణనీయంగా దోహదపడుతుందని తెలిపారు.

16
1185 views