logo

మహిళలు నేరాలపై భయపడకుండా ఫిర్యాదు చేయాలి: సీఐ గౌతమి.

పాణ్యం (AIMA MEDIA): నేరాలపై మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ, సైబర్ క్రైమ్ ఇన్చార్జి గౌతమి పేర్కొన్నారు. శుక్రవారం ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినిలకు వ్యక్తిగత భద్రత సైబర్ నేరాలపై ఆన్లైన్ సెల్ఫ్ డిఫెన్స్ ఉమెన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలపై పెరుగుతున్న సైబర్ ముప్పు, జాగ్రత్త చర్యలు, చట్టపరమైన పరిష్కారాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు జరిగినప్పుడు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి సైబర్ నేరాలు నియంత్రించాలని ఆమె కోరారు. విద్యార్థులలో వ్యక్తిగత భద్రత, బాధ్యత, డిజిటల్ వినియోగం, ఆన్లైన్ ప్లాట్ఫార్మ్లను రక్షితంగా ఉపయోగించే విధానాలను వివరించారు. హైదరాబాదు నీలిట్ డైరెక్టర్ డాక్టర్ కొర్ర లక్ష్మణ్ సెల్ఫ్ డిఫెన్స్ పద్ధతులు, సురక్షిత వాతావరణము, ఆన్లైన్ ప్రవర్తన, సైబర్ హైజిస్ పై సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్, డీన్ డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ రామిరెడ్డి, హెచ్ ఓ డి డాక్టర్ సుబ్బారెడ్డి, విద్యార్థినీలు పాల్గొన్నారు.

2
231 views