నిండుగొండ MPUP స్కూల్‌లో బాల్యవివాహ రహిత ప్రతిజ్ఞ
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం నిండుగొండ మాధ్యమిక పాఠశాల (MPUP)లో బాల్యవివాహరహిత ఆంధ్రప్రదేశ్‌ను నిర్మాణం చేయేందుకు పిల్లలు, అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేసుకున్నారు. బుచ్చంపేట సెక్టార్ సూపర్వైజర్ షేక్ ఉన్నిష బేగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.హెడ్ మాస్టర్ సంక్షేమంలో నిర్వహించిన బాల్యవివాహ నిర్మూలన ప్రజ్ఞా కార్యక్రమంలో స్కూల్ పిల్లలు, అంగన్వాడీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. షేక్ ఉన్నిష బేగం పిల్లలకు బాల్యవివాహ యొక్క , చట్టపరమైన నిబంధనలు, విద్యాభ్యాస ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ప్రతిజ్ఞలో పాల్గొన్న పిల్లలు బాల్యవివాహానికి వ్యతిరేకంగా నిలబడి, సమాజానికి ఈ సందేశాన్ని వ్యాప్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం గ్రామంలో బాల్యవివాహాలను నిర్మూలించడానికి ఒక మైలురాయిగా నిలిచింది