logo

రోలుగుంట మండలంలోని పాఠశాలల్లో ఎంఈఓ పర్యటన : విద్యార్థుల అభ్యున్నతి, మధ్యాహ్న భోజన పథకం పరిశీలన

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని వివిధ పాఠశాలల్లో మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (ఎంఈఓ) జాన్ ప్రసాద్ మరియు జగ్గారావు ఆకస్మిక పర్యటనలు నిర్వహించారు. మండలంలోని రత్నంపేట, బీవీపట్నం, ఎంకే పట్నం పాఠశాలలను సందర్శించిన ఈ ఇద్దరు అధికారులు విద్యార్థుల చదువు, వారి అభ్యున్నతి, పాఠశాల పరిశుభ్రత కార్యాచరణలపై ముఖ్య దృష్టి సారించారు.పాఠశాలల్లో విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎంఈఓలు, వారి చదువు పురోగతి గురించి వివరాలు సేకరించారు. ముఖ్యంగా ఆంగ్ల భాష విషయంలో విద్యార్థుల ప్రగతి ఎలా ఉందో ప్రతి విద్యార్థినీ అడిగి తెలుసుకున్నారు. "విద్యార్థుల అభ్యున్నతికి పాఠశాలలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఆంగ్ల భాషలో మీ పురోగతి ఎలా ఉంది?" అని వివరంగా అడిగారు.అలాగే, డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం భోజనం నాణ్యత, సరఫరా, రుచిపై శ్రద్ధగా పరిశీలించారు. ప్రతి విద్యార్థినీ ప్రత్యేకంగా అడిగి, "భోజనంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? నాణ్యత బాగుందా?" అని తెలుసుకున్నారు. పాఠశాలల పరిశుభ్రత, కార్యాచరణలను పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు.ఈ తనిఖీలు మండలంలో విద్యా నాణ్యతను మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సందర్శనకు సంతోషం వ్యక్తం చేశారు

5
1064 views