నర్సంపేట: కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 1. 19 లక్షల సహాయం
జర్నలిస్ట్: ఆకుల గణేష్
వరంగల్ జిల్లా నర్సంపేట కానిస్టేబుల్ గడ్డం ప్రభాకర్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి మామునూరు 4వ బెటాలియన్ బ్యాచ్ సభ్యులు అండగా నిలిచారు. బుధవారం మామునూరు బెటాలియన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రూ. 1,19,500 ఆర్థిక సాయాన్ని ప్రభాకర్ కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు దశరథం, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.