ఏటూరునాగారం: పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో
జర్నలిస్ట్: ఆకుల గణేష్
వచ్చే ఏడాది పుష్కరాల సందర్భంగా ములుగు జిల్లా రామన్నగూడెం, ముళ్లకట్ట ప్రాంతంలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లను గురువారం ఆర్డీఓ వెంకటేష్ పరిశీలించారు. గోదావరి వరదనీరు లోతుగా ఉంటే ఇసుక బస్తాలతో పూడ్చాలని, మెట్లు వెడల్పు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అధిక ప్రవాహ ప్రాంతాల్లో ఘాట్లు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ-ప్రైవేట్ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ పై సీఐ శ్రీనివాస్ కు సూచనలు చేశారు.