logo

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే ఎం.జీ.ఆర్

*🔸ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు...*

*🔸నియోజకవర్గంలో పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే గారు...*

*🔸వంశధార నిర్వాసితులపై గతంలో నమోదు చేసిన కేసులను మానవతా దృష్టితో ఉపసంహరించుకోవాలని, వారికి న్యాయం చేయాలని కోరారు.*

*🔸జల జీవన్ మిషన్ నిధులు 110 కోట్లు పునరుద్ధరణ చేసి నియోజకవర్గం ప్రజలు నీటి కష్టాలను తీర్చాలని కోరిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు...*

*🔸మహేంద్ర తనయ & వంశధార నదులపై నూతన వంతెనల మంజూరు కోసం విజ్ఞప్తి...*

*🔸నియోజకవర్గ ప్రజల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పలు ప్రధాన రహదారులను డబుల్ రోడ్లుగా విస్తరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం సమర్పించారు.*

*🔸నియోజకవర్గంలో సాగునీటి సమస్యల పరిష్కారం కోసం పలు ఎత్తిపోతల పథకాలు అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.*

*🔸వరద ముప్పు గ్రామాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు..*

*🔸గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జల జీవన్ మిషన్ (ఇంటింటి కోలాయి పథకం) కింద సుమారు ₹110 కోట్ల నిధులు వెనక్కు మళ్లించబడిన విషయాన్ని ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు.మహేంద్ర తనయ నది ఎగువ ప్రాంతాల ప్రజలకు తాగునీటి సరఫరా కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో ఆ నిధులను తక్షణమే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.*

*🔸భగీరథపురం నుండి హిరమండలం మండల కేంద్రానికి వంశధార నది మీదుగా నూతన వంతెన నిర్మాణం మంజూరు చేయాలని కోరారు. ఇది ప్రజలకు, విద్యార్థులకు, రైతులకు ఎంతో ఉపయోగకరమని వివరించారు.*

*🔸హిరమండలం మండలం కల్లట - జిల్లేడుపేట గ్రామం ప్రతి ఏడాది భారీ వర్షాల వల్ల మహేంద్ర తనయ నది ఉప్పొంగి గ్రామ ప్రజలు రోజుల తరబడి చిక్కుకుపోతున్నారని తెలిపారు.గ్రామ ప్రజలకు రక్షణగా నూతన వంతెన నిర్మిస్తే విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని నిధులు మంజూరు చేయాలని కోరారు.*

*🔸పాతపట్నం మండలం బూరగాం గ్రామ రైతులు ప్రతిరోజు మహేంద్ర తనయ నది దాటి పొలాలకు వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, గ్రామ ప్రజలు, రైతుల ఆశలు దిశగా అడుగులు వేస్తూ నూతన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.*

*🔸పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని కె.గోపాలపురం, ఎం.గోపాలపురం హామ్లెట్ గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాల సమయంలో కాజ్‌వే మునిగిపోవడంతో రైల్వే బ్రిడ్జిపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని వివరించారు.ప్రజల ప్రాణ భద్రత కోసం నూతన వంతెన మంజూరు చేయాలని కోరారు..*

*🔸 ఈరోజు పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో పలు సమస్యలు పై వినతి పత్రం సమర్పించారు అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు...*

13
603 views