logo

గ్రామ సచివాలయంలో BLO మరియు ఇతర అదనపు బాధ్యతలను కేవలం 4–5 మంది కార్యాలయ సిబ్బందికే...

.BLO & అదనపు బాధ్యతలు:
గ్రామ సచివాలయంలో BLO మరియు ఇతర అదనపు బాధ్యతలను కేవలం 4–5 మంది కార్యాలయ సిబ్బందికే కేటాయిస్తున్న విషయాన్ని UWGEA అసోసియేషన్ ద్వారా డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై డైరెక్టర్ తక్షణమే చర్యలు తీసుకుని, కేవలం సచివాలయ ఉద్యోగులకు మాత్రమే కాక విలేజెస్ లో ఉన్న ఇతర 14 కేటగిరీల కూడా బి ఎల్ వో విధులు అప్పగించేలా జిల్లా కలెక్టర్లకు రేపటిలోనే ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇది సంఘం ప్రతినిధిత్వానికి లభించిన తక్షణ సానుకూల ఫలితం.

ఆర్థిక స్థిరత్వం:
ఇటీవల సచివాలయ ఉద్యోగుల మరణాలు కేవలం పని ఒత్తిడి ఎందుకు అవుతుంది అనేక కారణాలు ఉండొచ్చు అనే గౌరవ డైరెక్టర్ ప్రశ్నకు సమాధానంగా అటెండర్ స్థాయి బేసిక్ ని తీసుకుని సుమారు 15 కిలోమీటర్ల పైన ఉద్యోగాలు చేస్తున్న సచివాలయ ఉద్యోగులు ఎందరో , వారి ట్రావెలింగ్ చార్జెస్, ఇతరత్రా ఖర్చులు ఇవన్నీ కూడా వారి ఆర్థిక స్థితిని ప్రతిబింబించడమే కాక ఒక వ్యక్తి యొక్క మిగిలిన అన్ని అంశాలను కూడా ప్రభావితం చేస్తాయి, కావున మా ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా మాకు రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అయిన ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీం, & నోషనల్ ఇంక్రిమెంట్స్ పైన పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి మా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచండి అని తెలియజేశారు.

సచివాలయ ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వం అత్యంత అవసరం అని సంఘం ప్రస్తావించింది. ఆర్థిక అస్థిరతతో పాటు పనిభారం పెరగడం వల్ల మానసిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలియజేయడమైనది..

సీనియారిటీ లిస్ట్ & గ్రేస్ మార్కులు:
సీనియారిటీ జాబితాను పారదర్శకంగా సిద్ధం చేయాలని కోరారు

మీరు కూడా అందరిలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు మీకు మీరు మిగిలిన రెగ్యులర్ ఎంప్లాయిస్ అని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా
అందరిలాగే మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయిస్ అలానే అందరిలాగా మాకు కూడా అందరూ వేస్తున్న అటెండెన్స్ FRS app నో ఇవ్వవలసిందిగా కోరారు..
సమాధానం: 200 కోట్లు పెట్టి GSWS attendence యాప్ ను FRS కంటే ముందు తీసుకురావడం జరిగింది.. ఇప్పుడు మళ్లీ మీ 1, 20 కి ఎంప్లాయిస్ కి ఎఫ్ ఆర్ ఎస్ అటెండెన్స్ యాప్ బడ్జెట్ ఆర్థిక అంశంతో కూడుకున్నది అని ముడి పెట్టడం జరిగింది..

కంపాషనేట్ అపాయింట్మెంట్:
విధి నిర్వహణలో ఉండగా కుటుంబానికి ఏకైక ఆదారమైన ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణించిన పక్షంలో, అర్హత కలిగిన కుటుంబ సభ్యునికి దయాధారిత నియామకం (Compassionate Appointment) ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఆదివారాలు , ఎర్లీ అవర్స్ , ఆఫ్టర్ అవర్స్ సర్వేలు చేయమంటూ రాష్ట్రంలో పలుచోట్ల వచ్చిన షర్టుల గురించి తెలియజేయగా ,
నాకు సమాచారం అందిన వెంటనే ఆదివారాలు పనిచేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని తెలియజేశాము అని గౌరవార్డు డైరెక్టర్ చెప్పారు.. దానికి ప్రతిస్పందనగా అసోసియేషన్ తరపున మేము స్టాండ్ తీసుకొని ఆదివారం సెలవు రోజుల్లో పని చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ ని అసోసియేషన్ తరపున మేము మా ఎంప్లాయిస్ కి పాస్ చేయడం జరిగింది అనే విషయాన్ని డైరెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది..

సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ డ్యూటీలు తీసివేయకుండా, టాయిలెట్ వద్ద డ్యూటీలు టాయిలెట్ డ్యూటీలు అనే పదాల మధ్య పెద్ద తేడా సర్కులర్లో మార్పులు చేయడం వలన ఎటువంటి ఉపయోగం లేదు అని అని డైరెక్టర్ ని డైరెక్ట్ గానే మర్యాదపూర్వకంగా అడగడం జరిగింది..

స్కూళ్లలో టీచర్లకి కష్టంగా అనిపించిన టాయిలెట్ డ్యూటీలు సచివాలయ ఉద్యోగులకు ఎందుకు కష్టం కాదు అని అడగగా మేము ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ విషయమై రాసి పంపించాము , ఖచ్చితంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలియజేశారు..

వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కి సంబంధించిన ప్రమోషన్ ఛానల్ విషయమై కడప జిల్లాకు సంబంధించిన సుమారు 200 మంది బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు , మేము ఆపడం జరిగింది అనే వాస్తవాన్ని , అది వాస్తవమే కాబట్టి తెలియజేయడం జరిగింది... ధర్నాలు చేస్తే ఏమొస్తుంది, ప్రమోషన్ ఛానల్ కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లలో ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ మంచి బేసిక్ తోనే ప్రపోజల్ పెట్టి ఉన్నాము అని తెలియజేశారు... తర్వాత పరిస్థితులు చూడాలి..

IVRS కాల్స్ కి సంబంధించి ఒకటి నొక్కండి రెండు నొక్కండి అంటే, మీరు ఏ విధంగా trigger అవుతారు అని అన్నారో, జనాలు కూడా అదే ట్రిగర్ లో ఉన్నప్పుడు కాల్స్ వస్తే ఏదో ఒకటి నొక్కుదాం లే అని నొక్కడం వల్ల వచ్చే ఇబ్బందులకు మా ఎంప్లాయిస్ ని కారకులను చేయడం సమంజసం కాదు అంతలే చేయడం అయినది. IVRS అనే టూల్ ఎంతవరకు ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది అని దానిపై ఇంకొక టూ ని ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేయడమైనది..
ఇంటర్ డిస్టిక్స్ spouse ట్రాన్స్ఫర్లకు సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు.. ఇంకొన్ని డిపార్ట్మెంట్లలో వారు పట్టించుకోని కారణంగా మేమే టేస్టూ కేస్ వెరిఫై చేస్తున్నాము , ఫిబ్రవరి 28 లోపు ఇంటర్ డిస్టిక్స్ spouse ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి అన్ని కేసెస్ ని క్లియర్ చేస్తామని తెలియజేశారు.
మీటింగ్ అయితే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం లో చాలా హెల్తీగా , ఒక ఫ్యామిలీ అట్మాస్పియర్ లో జరిగింది.. డైరెక్టర్ కూడా చాలా ఓపికగా ఎటువంటి అసహనం వ్యక్తం చేయకుండా , తన ఎక్స్పీరియన్సెస్ ని మోటివేషనల్ గా చెప్తూ పాజిటివ్ vibes ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు... ఆ ప్రయత్నంలో నాలాంటి వాళ్ళ చాలామంది వాయిస్లు ఇంకా రైస్ చేయాలి అనుకున్న అంశాలను అనేక సమస్యలను రైస్ చేయకుండా కొంత బ్రేక్ పెట్టారు....
వాస్తవానికి అనేక అంశాలను కచ్చితంగా ఈరోజు ప్రశ్నించాలి అనుకుని వెళ్లిన నేను కూడా డైరెక్టర్ఎక్కడో సచివాలయ ఉద్యోగుల మీద కొంత మానవతా దృక్పథం కలిగి ఉన్నారు అనేది కొంత అనిపించి, అసలు వివక్షతకు కారణమైన అంశాలు, పని ఒత్తిడికి సంబంధించిన అంశాల విశ్లేషణ మన దగ్గర పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అప్పటి పరిస్థితులను బట్టి కొంత వెనక్కు తగ్గే రావాల్సి వచ్చింది..

షోకాజుల విషయంలో కూడా షోకాజులు ఏమైంది, వాటిని పట్టించుకోవాల్సిన అవసరమేంటి అన్నట్లుగా తెలియజేశారు
అటెండెన్స్ ల విషయమై పేపర్లో వచ్చిన కథనాల మేరకు ప్రస్తుతానికి కొంత కాన్సన్ట్రేషన్ , తర్వాత అది కూడా ఉండదు... ఇప్పుడు కూడా మార్నింగ్ అటెండెన్స్ మాత్రమే కదా చూస్తున్నాము... ఒకటో తేదీ అయితే అసలు అటెండెన్స్ ఏ పట్టించుకోవట్లేదు.. అందరూ పెన్షన్ పంపిన ఉంటారు కాబట్టి , ఒకటవ తేదీ అటెండెన్స్ ని తీసుకోవట్లేదు అని తెలియజేశారు..

భవిష్యత్తులో ట్రాన్స్ఫర్లు కూడా టీచర్లకు ఏ విధంగా పారదర్శకంగా జరుగుతున్నాయో , అదేవిధంగా పారదర్శకత్వంతో కూడిన ట్రాన్స్ఫర్లు డైరెక్ట్ గా ఆన్లైన్ సిస్టం ద్వారానే మాన్యువల్ ఇంటర్ ఫియరెన్స్ లేకుండా ,
చట్టబద్రతతో కూడిన ట్రాన్స్ఫర్లు జరిగేలా ప్రయత్నం చేస్తున్నాము అని తెలియజేశారు..

నేను నెల్లూరు వాసిని, స్టార్టింగ్ లో 9,500 జీతంతో పని చేశాను , అప్పట్లో ఆర్థిక పరిస్థితికి నాకు కూడా సరిపోయేది కాదు , సూసైడ్ టెండెన్సీ నాకు కూడా అప్పుడప్పుడు ఉండేది , , కానీ పిల్లలు, ఇంట్లో ఫ్యామిలీ గుర్తు వచ్చి ఆగిపోయాను అని తన పర్సనల్ అనుభవాన్ని పంచుకుంటూ , ప్రాణం చాలా విలువైనది, ఉద్యోగం పోతే పోయింది, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి, ప్రాణం పోతే వస్తుందా, మీ కుటుంబాలకు అది ఎంత తీరనిలోటు,, అంతగా బాధనిపిస్తే పది రోజులు సెలవు పెట్టండి., ప్రాణాలు తీసుకోవద్దు అని చెప్పారు.. అలాంటి టెండెన్సి ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపించిన అనిపించినా మాట్లాడండి అని చెప్పారు..

ఫైనల్ గా అన్ని విషయాలకు పూర్తి సొల్యూషన్ రాకపోయినా కొంత సానుకూలంగానే ఓపికగా సమాధానం చెప్పారు.. ఫైనల్ గా ఈరోజు ఎలా అయినా తదుపరి కార్యాచరణకు సంబంధించి notice ఇచ్చి రావాలి అని అనుకున్న నాలాంటి వాళ్లందరినీ శాంత పరిచి పంపించారు....

ఇక్కడ కేవలం నేను ఇన్వాల్వ్ అయిన సంభాషణకు సంబంధించిన సమాచారం మాత్రమే ఇవ్వడం జరిగింది.. పూర్తి సమాచారాన్ని వీలైతే మెసేజ్ రూపంలో లేదా వీడియో రూపంలో మీకు రేపు తెలియజేయడం జరుగుతుంది..

*రాజ్యలక్ష్మి గుజ్జల*
రాష్ట్ర అధ్యక్షురాలు
UWGEA (236/24)
Unity OF GSWS -E

0
687 views