జీవగ్రో వారి ‘ఇవాల్వ్’ ఎర్ర నల్లి మందు ఆవిష్కరణ......
జీవగ్రో వారి ‘ఇవాల్వ్’ ఎర్ర నల్లి మందు ఆవిష్కరణ.తోట ప్రదర్శన క్షేత్రం నివేదిక
గార్లదిన్నె ఈ రోజు జీవగ్రో కంపెనీ వారు చినీ తోటలో, కొత్తగా ఉద్భవిస్తున్న ఎర్ర నల్లి సమస్యపై ప్రభావవంతంగా పనిచేసే ‘ఇవాల్వ్’ అనే ఉత్పత్తిని గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామరైతుల సమక్షంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కంపెనీ రీజినల్ మేనేజర్ డివిఎస్ సుధాకర్ మాట్లాడుతూ, జీవగ్రో సంస్థ ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించే అద్భుతమైన సంస్థ అని పేర్కొన్నారు...కంపెనీ కార్యకలాపాలను సంక్షిప్తంగా వివరించారు. అనంతరం కంపెనీ డెవలప్మెంట్ మేనేజర్ రాజేష్ ‘ఇవాల్వ్’ ఉత్పత్తి లక్షణాలు, వాడుక విధానం మరియు దాని ప్రయోజనాలను రైతులకు స్పష్టంగా వివరించారు.
సమావేశం చివరలో, ‘ఇవాల్వ్’ వాడడం ద్వారా మంచి ఫలితాలు పొందిన చిని తోటను రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. రైతులు ఉత్పత్తి పనితీరును చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
జీవగ్రో వారి ‘ఇవాల్వ్’ ఎర్ర నల్లి నియంత్రణలో సుమారు 20 రోజుల పాటు అద్భుతంగా పనిచేస్తుందని వివరించారు.
ఈ సమావేశంలో దాదాపు 200 మంది చిని రైతులు పాల్గొన్నారు.
ధన్యవాదాలు.